Header Banner

దర్యాప్తు పేరుతో వేధింపులు! మళ్లీ అవే ప్రశ్నలు ఎందుకు? వాద్రా ఆగ్రహం!

  Wed Apr 16, 2025 21:42        Politics

కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా తనపై జరుగుతున్న రాజకీయ దాడులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంతో తన అనుబంధమే ఈ దాడులకు కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రజల కోసం పోరాడే కుటుంబానికి చెందినవాడిని కాబట్టే బీజేపీ మమ్మల్ని లక్ష్యంగా మార్చుతోంది" అంటూ విమర్శించారు. ఈడీ విచారణలో రెండో రోజు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, "బీజేపీ ఎంత దాడి చేస్తే అంత బలంగా ముందుకు సాగుతాం. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండిఏపీలో మరో నామినేటెడ్ పోస్ట్ విడుదల! హజ్ కమిటీ చైర్మన్‌గా ఆయన నియామకం! రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

 

ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విమర్శించిన వాద్రా, ప్రజలు ఇక అటువంటి సంస్థలపై నమ్మకం ఉంచరని అభిప్రాయం వ్యక్తం చేశారు. "నేను బీజేపీలో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది" అని వ్యాఖ్యానించిన ఆయన, త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నానని స్పష్టం చేశారు. "ప్రజలు నాతో ఉన్నారు. వారు నా రాజకీయ ప్రవేశాన్ని కోరుకుంటున్నారు" అన్నారు. వాద్రా ఈ ప్రకటనతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. హర్యానాలో భూ కుంభకోణం కేసులో తనపై ఈడీ విచారణ కొనసాగుతుందని, 2008లో 3.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, అనంతరం అదే భూమిని భారీ ధరకు విక్రయించడంపై మనీలాండరింగ్ ఆరోపణలతో విచారణ జరుగుతోందని చెప్పారు. అయితే, 2019లోనే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చానని, ఇప్పుడు మళ్లీ అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. హర్యానా ప్రభుత్వం తనకు క్లీన్‌చిట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! మొత్తానికి ఫైబర్ నెట్ నుంచి 500 మంది ఉద్వాసన! పని చేయకుండానే జీతాలు చెల్లింపు!

 

కూటమి ప్రభుత్వం మరో నామినేటెడ్ పోస్ట్ కి శ్రీకారం! ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఫిక్స్!

 

ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravsi #robertvadra #politicaltarget #gandhifamily #edinquiry